08 July 2020

పసుపు పాల కంటే ఎఫెక్టివ్‌గా పనిచేసే ఇమ్యూనిటీ డ్రింక్ ఇదే..


Telugu News


Ravula Amala | Samayam Telugu | Updated: 08 Jul 2020, 09:01:00 PM
ఈ మధ్య ఎక్కడ చూసినా ఇమ్యూనిటీ గురించిన కబుర్లే వినిపిస్తున్నాయి. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనే చర్చలే నడుస్తున్నాయి. అసలు ఈ ఇమ్యూనిటీ అంటే ఏమిటి, దాని కధా, కమామిషూ ఏమిటో తెలుసుకుందాం.
74188998
74188998
   
ఇమ్యూనిటీ అంటే ఏమిటి?


ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. ఈ శక్తి మనని ఇంఫెక్షన్స్ నించీ, జబ్బులనించీ కాపాడుతుంది. మనం పుట్టినప్పుడే కొంత ఇమ్యూనిటీతో పుడతాం. దీన్ని నాచురల్ ఇమ్యూనిటీ అంటారు. తరువాత మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన జీవనశైలిని బట్టీ, మన పరిసరాలని బట్టి మనకి కొంత ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిని ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంకొకరి నించి ట్రాన్స్ఫెర్ చేసే ఇమ్యూనిటీని పాసివ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది ఆ అవసరానికే పనికొస్తుంది. నాల్గవది ఇమ్యునైజేషన్. అంటే వ్యాక్సిన్ల వంటి వాటి ద్వారా కొన్ని ప్రత్యేకమైన రోగాలను నిరోధించే శక్తి ని కలుగచేయడం.

ఈ ఇమ్యూనిటీని మనం పెంచుకోగలమా?


చక్కగా పెంచుకోగలం. ఇమ్యూనిటీని రకరకాల మార్గాల్లో పెంచుకోగలం. రోజుకి ఆరు నించీ ఎనిమిదిగంటల నిద్రా, రోజూ కనీసం ముప్ఫై నిమిషాల వ్యాయామం, ఒత్తిడి తాగించుకుని ప్రశాంతం గా ఉండడం, కావాలసినంత నీరు తాగడం తో పాటూ ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ ని పెంచుకోగలుగుతాం. నిజానికి త్వరగా ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారమే ఏకైక మార్గం. పండ్లూ, పండ్ల రసాలూ, తాజా కూరగాయలూ, పాలూ, పాల పదార్ధాలూ సరైన పాళ్ళలో తీసుకుంటే ఇమ్యూనిటీ తొందరగా పెరుగుతుంది.

వాతావరణం మారిన ఈ సమయం లో రుచి గా ఉండే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ని ఇక్కడ పరిచయం చేస్తున్నాం. మీరు కూడా హాయిగా ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుని తాగి హాపీ గా ఉండండి.


మనందరికీ గోరువెచ్చని పాలలో ఒక్క చిటికెడు పసుపు వేసి రాత్రిపూట తాగడం తెలుసు. చిన్నపిల్లలకి ఇది బాగా హెల్ప్ చేస్తుందని వాళ్ళకి రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాం. దీన్నే కొంచెం మారిస్తే పిల్లలూ, పెద్దలూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇది తయారు చెసేప్పుడే కొంచెం ఎక్కువ తయారు చేసుకోండి. పిల్లలూ, పెద్దలూ కూడా మరి కాస్త కావాలని అడుగుతారు. పైగా ఇది వీగన్ కూడా. ఈ వీగన్ టర్మరిక్ జింజర్ ఫ్రాపే ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

samayam telugu
jpg (9)



వీగన్ టర్మరిక్ జింజర్ ఫ్రాపే

కావలసిన పదార్ధాలు:

ఆల్మండ్ మిల్క్ - ఒక కప్పు
పసుపు - ఒక టీ స్పూన్
అల్లం - ఒక టీ స్పూన్
బాదాం పప్పు - మూడు
నట్ మెగ్ పౌడర్- ఒక చిటికెడు
దాల్చిన చెక్క పొడి - ఒక చిటికెడు
మిరియాల పొడి - ఒక చిటికెడు
బెల్లం పొడి - ఒక టీ స్పూన్

తయారు చేసే పద్ధతి


బాదాం పప్పులని సన్నని తరుగులా చేసి పక్కన ఉంచండి. మిగిలిన పదార్ధాలనీ బాగా బ్లెండ్ చేసిన తరువాత ఈ సన్నని బాదాం పప్పుల తురుముని కూడా అందులో కలిపి అస్వాదించండి. ఇది బనానా అవకాడో మ్యూస్ తో కలిపి తాగితే ఇంకా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫ్రాపే చాలా రుచిగా ఉంటుంది. ఇది తాగితే మీ టేస్ట్ బడ్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చినట్లే. ఇందులో కలిపిన పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క వలన ఇమ్యూనిటీ పెరగడానికి సహకరిస్తుంది. పైగా ఇందులో బెల్లం కూడా కలిపాం కనక శరీరానికి ఐరన్ అందుతుంది. ఈ మాన్సూన్ టైం లో ఇంత కంటే ఇంకేం అక్కర్లేదు.

బనానా అవకాడో మ్యూస్ కూడా కలిపి తీసుకున్నారనుకోండి, అందులో ఉన్న అరటి పండు, అవకాడో, నట్స్ వల్ల రుచి కి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.



'సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి
Like
డౌన్‌లోడ్ యాప్‌

ఎక్కువగా చదివినవి
Adv: అమెజాన్‌లో వన్ స్టాప్ ఆడియో స్టోర్

ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు.. కరోనా అస్సలు రాదంటున్న ఆయుర్...
పిల్లలు పుట్టడం లేదా.. ఈ టీని తాగితే సమస్య తీరుతుందట.....
ఈ టీ తాగితే చాలు.. ఎంత బరువున్నా ఈజీగా తగ్గుతారు.....
మిరియాలతో ఇలా చేస్తే జలుబు తగ్గి ఇమ్యూనిటీ కూడా పెరుగుత...
పిల్లలు పుట్టడం లేదా.. ఈ టీని తాగితే సమస్య తీరుతుందట..
తరవాత కథనం
మరింత సమాచారం తెలుసుకోండి:
పసుపు పాలుఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలాtips for immunity powernatural ways to increase immunitybest immunity drink
Web Title : vegan turmeric ginger drink for immunity boosting
Telugu News from Samayam Telugu, TIL Network
 | Andhra Recipes in Telugu | Relationship Tips in Telugu | Health Tips in Telugu
Telugu Newslifestylehome remediesvegan turmeric ginger drink for immunity boosting
యాప్‌లో చదవండి
పిల్లలు పుట్టడం లేదా.. ఈ టీని తాగితే సమస్య తీరుతుందట..
ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు.. కరోనా అస్సలు రాదంటున్న ఆయుర్వేద నిపుణులు..
ఈ టీ తాగితే చాలు.. ఎంత బరువున్నా ఈజీగా తగ్గుతారు..
మిరియాలతో ఇలా చేస్తే జలుబు తగ్గి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది..
బేకింగ్ సోడాతో ఇలా చేస్తే గుండెకి మంచి రక్తం అందుతుంది..
EXPLORE TELUGU SAMAYAM : Telugu News HeadlinesAP News in TeluguTelangana NewsHyderabad News in TeluguTelugu News LiveLatest News in TeluguHyderabad Crime NewsGST in TeluguIndia News
OTHER TIMES GROUP NEWS SITES : Economic TimesOrder NewspaperColombia Ads and PublishingNBT Gold PodcastEi Samay Gold Podcast
OTHER LANGUAGES
HindiKannadaMalayalamTamilMarathiBanglaSamayamGujaratiEnglish
DOWNLOAD OUR APPS
FOLLOW US ON
Contact UsAbout UsTerms of useDesktop VersionPrivacy policyCreate Your Own AdAdvertise with usFeedbackNewsletterSitemapRSS
Copyright - 2020 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights : Times Syndication Service

No comments: