26 May 2021

Education

*🔊🔊ఈ ఏడాదీ నెట్టింట్లోనే పాఠాలు!*

*📚నూతన విద్యాసంవత్సరానికి రోడ్‌మ్యాప్‌*

*💫మూడు దశల్లో సన్నద్ధమవ్వాలన్న కేంద్రం*

*🖥️డిజిటల్‌, ఆన్‌లైన్‌ ఏర్పాట్లకు ఆదేశాలు*

*🛍️తెలంగాణ విద్యా విధానాలకు ప్రశంసలు*

హైదరాబాద్‌, *🌏 కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని కేంద్రం రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొవిడ్‌ యాక్షన్‌ప్లాన్‌తోపాటు, రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ర్టాలు చేసుకోవాలని ఆదేశించింది. రేడియో, టీవీ, యాప్‌లు, పోర్టళ్లు, ఈ లైబ్రరీలు, వాట్సాప్‌, లౌడ్‌స్పీకర్లలో పాఠ్యాంశాల ప్రసారం తదితర విధానాలను అమలుచేయవచ్చని సూచించింది. నూతన విద్యా సంవత్సరాన్ని మూడు దశల్లో కొనసాగించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. అవి నిర్వహణ దశ (మెయింటనెన్స్‌ ఫేజ్‌), పునరుద్ధరణ దశ (రీస్టోర్‌ ఫేజ్‌), అభివృద్ధి దశ (గ్రోత్‌ ఫేజ్‌). ఈ దశల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ర్టాలు తమ అవసరాలు, ఏర్పాట్లను బట్టి ప్రత్యేకంగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసుల నిర్వహణతో పాటు, డ్రాపౌట్లు, పాఠ్యపుస్తకాల వివరాలను అందజేయాలని ఆదేశించింది. 2030 నాటికి ప్రీప్రైమరీ నుంచి సీనియర్‌ సెకండరీ వరకు 100శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) లక్ష్యంగా నిర్దేశించుకోవాలని, ఈ దిశలో డ్రాపౌట్ల సంఖ్యను గణనీయంగా నివారించాలని పేర్కొన్నది.*

*మూడు ఫేజ్‌లివే..🔰*

*💫మెయింటనెన్స్‌ ఫేజ్‌లో మే-జూలై మాసాల్లో మధ్యాహ్న భోజనం అమలు, ఎస్‌ఎస్‌ఏ నిధుల కేటాయింపు, మొబైల్‌యాప్‌లు అందుబాటులోకి తేవడం, టీచర్లకు శిక్షణ, విద్యార్థుల నమోదు, సర్వే, డ్రాపౌట్ల నివారణ, వీక్లీప్లాన్‌ల రూపకల్పన.*

*🍥రీస్టోర్‌ ఫేజ్‌లో భాగంగా నవంబర్‌లో నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే, రాష్ట్రస్థాయిలో స్టూడెంట్‌ రిజిస్టర్‌ తయారీ, మూల్యాంకన విధానంలో మార్పులు చేపట్టాలి. బిడ్జికోర్సులను రూపొందించి, స్వల్పకాలిక శిక్షణనివ్వాలి.* 

*💫విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. డిజిటల్‌ తరగతుల నిర్వహణకు కంటెట్‌ తయారీలో నిమగ్నమవ్వాలి.*

*🛍️గ్రోత్‌ ఫేజ్‌లో భాగంగా యాక్షన్‌ ప్లాన్లపై సమీక్ష, మార్పులు చేర్పులు. పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో విద్యార్థుల సామర్థ్య పరీక్ష.*

*💫తెలంగాణ విధానానికి కితాబు*

*🍥పలు రాష్ర్టాల్లో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను సైతం కేంద్రం రోడ్‌మ్యాప్‌లో ఉదహరించింది. దీంట్లో తెలంగాణలో అత్యంత వేగంగా డిజిటల్‌ పాఠాలను తయారుచేసి, అమలు చేస్తున్న విధానం సైతం చోటు చేసుకున్నది. టీవీ పాఠాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా నిపుణులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణనివ్వడం, టీవీల్లో ప్రసారం చేయడం బాగున్నట్లు కితాబిచ్చింది.*

*💫నాగాలాండ్‌లో తరగతులవారీగా రికార్డు చేసిన పాఠ్యాంశాలను డీవీడీలు, పెన్‌డ్రైలలో లోడ్‌చేసి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు.*

*🍥మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ‘డొనేట్‌ ఏ డివైజ్‌’ క్యాంపెయిన్‌తో 4,500 మంది విద్యార్థులకు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు సమకూర్చారు.*


*📻మధ్యప్రదేశ్‌లో రేడియోపాఠాలు అమలుచేశారు. పలు స్లాట్లలో ఎఫ్‌ఎం రేడియోలు, జాతీయ రేడియోల ద్వారా ప్రసారం చేశారు. ఇదే రాష్ట్రంలో 50వేల పైచిలుకు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బోధన కొనసాగించారు.*

*🍥గుజరాత్‌, మహరాష్ట్రల్లోని కొన్ని జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల ద్వారా కథలు, పద్యాలను వినేలా ఏర్పాట్లు చేశారు.*

*🌻కేరళలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడి ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులందరికీ డిజిటల్‌ డివైజ్‌లను సమకూరుస్తున్నారు.*

*🍥హర్యానాలో ‘శిక్షామిత్‌’్ర పేరుతో డిజిటల్‌ తరగతులు కొనసాగే సమయాల్లో తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు, స్నేహితులు సెల్‌ఫోన్లు సమకూర్చి, తరగతులు పూర్తికాగానే తిరిగి తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.*