23 January 2019

వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?


వాట్సప్... ఒకప్పుడు కేవలం టెక్స్ట్‌ మెసేజ్‌లకు మాత్రమే పరిమితం. కానీ ఆ తర్వాత అనేక ఫీచర్లు వచ్చాయి. ఇప్పుడు ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు పంపుకోవచ్చు. అంతేకాదు... వాట్సప్‌లో చాలా ఫీచర్లున్నాయి. కానీ వాటిని వాడేవాళ్లు తక్కువే. మరి వాట్సప్‌లో ఆకట్టుకునే ఈ 9 ఫీచర్లు మీరు ట్రై చేశారా? అసలు ఆ ఫీచర్లు ఏంటీ? వాటి ఉపయోగమేంటీ? తెలుసుకోండి.


Updated on: January 23, 2019, 3:49 PM IST

webtech_news18 , News18 Telugu



1. మీడియా విజిబిలిటీ: ఏదో ఓ ఛాట్ నుంచి వచ్చే ఫైల్స్ హైడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు కాంటాక్ట్ ఇన్ఫోలోకి వెళ్లి 'Media Visibility' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో Default (Yes), Yes, No అని మూడు ఆప్షన్లుంటాయి. ఈ ఆప్షన్ యాక్సెప్ట్ చేస్తే అందులో వచ్చే ఫైల్స్ ఫోన్ గ్యాలరీలోకి సేవ్ కావు.

2. మ్యూట్ గ్రూప్ ఛాట్: వాట్సప్ గ్రూప్స్ మీ సర్కిల్‌లో ఉన్నవారిని ఒకేవేదికపైకి తీసుకొచ్చే మంచి ఫీచర్. కానీ క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, ఆఫీస్ ఇలా అనేక గ్రూప్స్ ఉంటాయి. వాటిలో వచ్చే మెసేజ్‌లతో మెసేజ్ టోన్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. మీరు గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లి 'Mute Chat' ఆప్షన్ ఎంచుకున్నారంటే ఇక మెసేజ్ టోన్స్ వినిపించవు.

3. డిసేబుల్ బ్లూ టిక్: ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఫీచర్ ఇది. మీకు వచ్చిన మెసేజ్ మీరు చదివారో లేదో పంపినవాళ్లకు తెలియకుండా చేసేందుకు ఉపయోగపడుతుంది ఈ ఫీచర్. ప్రైవసీ ఆప్షన్‌లో ఈ ఫీచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

4. వాట్సప్ గ్రూప్ వీడియో కాల్: ఇది యూజర్లకు ఫేవరెట్ ఫీచర్. స్నేహితులు, బంధువుల గ్రూప్‌లో అందరికీ ఒకేసారి వీడియో కాల్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

5. హైడ్ లాస్ట్ సీన్: మీరు వాట్సప్ చివరిసారిగా ఎప్పుడు ఉపయోగించారో లాస్ట్ సీన్ చూస్తే తెలిసిపోతుంది. అయితే ఈ విషయం ఎదుటివాళ్లకు తెలియకుండా మీరు ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లో అకౌంట్‌‌లో ప్రైవసీలో లాస్ట్ సీన్ ఆప్షన్ ఉంటుంది.

6. హైడ్ పర్సనల్ డీటెయిల్: మీ గురించి అవతలివాళ్లు ఏ వివరాలు తెలుసుకోకూడదంటే ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అందులో ప్రొఫైల్ ఫోటో, ఎబౌట్, స్టేటస్ లాంటివి ఉంటాయి. అన్నిట్లో Nobody అని సెలెక్ట్ చేస్తే చాలు.

7. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మరికొందరికి అడ్మిన్ స్టేటస్ ఇస్తుంటారు. ఆ తర్వాత వారి ప్రవర్తన నచ్చకపోతే అడ్మిన్‌గా తొలగించొచ్చు. గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లి వారి పేరుపై కాసేపు క్లిక్ చేస్తే the Dismiss As Group Admin ఆప్షన్ కనిపిస్తుంది.

8. షేర్ లైవ్ లొకేషన్: మీరు ఎక్కడైనా చిక్కుకుపోయినప్పుడు మీ లైవ్ లొకేషన్‌‌ని షేర్ చేసుకోవచ్చు. చాట్ బాక్స్‌లో అటాచ్‌మెంట్ మెనూలోకి వెళ్తే షేర్ లొకేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. 15 నిమిషాలు, 1 గంట, 8 గంటలు ఇలా ఎంతసేపు లొకేషన్ షేర్ చేసుకోవాలో మీ ఇష్టం.

9. మీ వాట్సప్‌లో ఎవరి మెసేజ్‌లు ఎక్కువ ఉన్నాయో, ఎవరితో ఎక్కువగా ఛాట్ చేశారో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు సెట్టింగ్స్‌లో డేటాలోకి వెళ్లి స్టోరేజ్ యూసేజ్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ కనిపిస్తుంది