ప్రొ;; మాజీ MLC కె నాగేశ్వర్ … ఎనాలసిస్
ఇంతటితో ప్రపంచం అంతం అవుతుందని అనుకోవడం సరికాదు. WHO అభిప్రాయం లో కోవిడ్ -19 వైరస్ సోకిన వారిలో 3-4% మాత్రమే మృత్యువాత పడుతున్నారు. కొన్నిదేశాలలోఈ శాతం కొంచెం ఎక్కువుగా ఉండవచ్చు.చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కొత్తగా పుట్టే జీవులు ఇంతకముందే వున్న జీవుల తగ్గుదల కు లేదా అంతానికి కారణం కావచ్చు. ఇది ప్రకృతిలో సాధారణం. మనుషుల వల్ల ఇప్పటికే చాలా జీవజాతులు అంతరించిపోయాయి. వైరల్ ఎపిడమిక్స్ మానవజాతి అంతానికి కారణం కాగలవని ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే మానవ మేదస్సు వీటి ప్రభావాన్ని అడ్డుకోగలదు. రోజు రోజుకి మనిషి మేధస్సుతో ఎంతో అభివృద్దిని సాధిస్తున్నాడు. ఈ అభివృద్దితో పాటూ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లా కొన్ని అనర్ధాలకు కారణం అవుతున్నాడు. ఆ అనర్ధాల స్పృహని ఎరిగి వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ వైరస్ ను చైనానే సృష్టించిందని, ఈ అనర్ధం వెనుక కూడా సైన్స్ పరిశోధనాలే కారణం అనీ ఆధారం లేని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మనం చరిత్ర ని చూసినట్లైతే ఇలాంటి మహమ్మారులు ఎన్నో వస్తున్నాయ్. అసలు సైన్స్ అభివృద్ది చెందని కాలం లో ఎన్నో వైరస్లు,బాక్టీరియాలు కోట్ల మంది మరణాలకు కారణమయ్యాయి. 1918 ప్రాంతం లో స్పానిష్ ఫ్లూ దాదాపు 5కోట్ల మందిని హరించింది. 1346-53 ప్రాంతం లో ప్లేగు యూరోప్ లో 1/3వంతు జనాభా ని మాయం చేసింది. ఇలా మానవ చరిత్రలో ఎన్నో దారుణ సంఘటనలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి మహమ్మరులను మానవ సమాజం అడ్డుకోగలుదా? *ఈ కోవిడ్-19 అనేది శాస్త్రవేత్తలు అభిప్రాయం లో ఒక బలహీనమైన వైరస్. అందుకే మరణ రేటు 3-4% ని పరిమితమైంది. ఒకవేళ ఇంతకన్నా బలమైన వైరస్ పుట్టి మరణ రేటు 30-40% ఉంటే? అది దీని కన్నా వేగంగా వ్యాప్తి చెందితే? వాటి ఇంక్యూబేషన్ సమయం కొన్ని గంటలు మాత్రమే అయితే? అది గాలి,నీరు ద్వారా వ్యాప్తి చెందితే? అది సోకిన మనిషి కేవలం కొన్ని గంటలలో మరణిస్తే? కొన్ని హాలివుడ్ సినిమాలలో మనుషులు జాంబిల్లా తయారయితే? పై వన్నీ వూహలే కానీ అసంభవాలు మాత్రం కాదు. అయితే పై వాటికి మనిషి సిద్దంగా ఉన్నాడా?వాటిని ఎదుర్కోగలడా ? ఇప్పటికే అభివృద్ది చెందిన దేశాలైన అమెరికా, ఇటలీ, స్పైయిన్ కరోనా తో తల్లడిల్లుతున్నాయి. ఇక ఆసియా,ఆఫ్రికా దేశాలు పరిస్థితులు ఎలా ఉండబోతుంది. మానవ జాతి ఇలాంటి విపత్తులని ఎలా ఎదుర్కోవాలి?* *ముందు విద్యా,వైద్యం పట్ల దేశాల వైఖరి మారాలి. జాతీయ వాదం లాంటి సంకుచిత భావాలు విడనాడాలి. ప్రజల్లో జాతీయావాదాన్ని రెచ్చగొడుతూ తమ ఉనికి కోసం ప్రజాస్వామ్య నియంతల వైఖరి మారాలి. మిలటరీ మీద పెట్టే ఖర్చుని తగ్గించుకోవాలి. అయితే ఇవన్నీ ప్రాక్టికల్ గా అసాధ్యం అనుకోవచ్చు కానీ మానవ ఉనికి కోసం ఇది జరగాలి.* *తరువాత చెప్పుకోబోయేది ఎన్నో యేళ్లుగా మనిషి అంధకారం లో ఉంచడానికి కారణం అవుతున్న సైన్స్ అభివృద్దికి విఘాతoగా ఉన్న,మనుషుల్లో మూఢత్వాన్ని పెంపొందిస్తున్న, మనుషుల్లో విచక్షణ జ్ఞానాన్ని అణచి సాటి మానవుల చావు కారణం అవుతున్న ‘మతం’. మనిషి సంఘజీవి గా ఉన్నప్పటి నుంచి ఈ మతం చేసిన అరాచకాలను ఒప్పుకోవడానికి ఏ మతానికి ధైర్యం చాలదు. చేసిన తప్పులని ఆత్మవిమర్శ చేసుకునే నిజాయితి అసలు లేదు. భారత్ లో అంటరాని తనానికి, కుల వ్యవస్థకి, పేదరికానికి, అజ్ఞానానికి, యూరోప్ దేశాల్లో ఎంతో మంది శాస్త్రవేత్తల క్రూరమైన చావులకి, ప్రస్తుత అరబ్ దేశాల్లో నియంతృత్వానికి, తీవ్రవాదానికి కారణమైనదీ ఇదే. మత మౌఢ్యం మనిషి పతనానికి ఏ రకంగా కారణం అవుతుందో చూద్దాం.* *కార్ల్ మార్క్స్ చెప్పిన సోమరి జాతుల్లో మత ప్రభోదకుల జాతి ఒకటి. వీళ్ళు దేశానికి గాని, మానవ సమాజానికి గాని ఎటువంటి శ్రమను, మూల ధనాన్ని గాని అందించకుండా శ్రమ జీవుల నుంచి దక్షిణలు, దశమ భాగాల పేరుతో శ్రమ దోపిడీకి పాల్పడతూ ఉంటారు. పైగా శ్రమజీవుల విశ్రాంతి దినాలను, సమయాన్ని కూడా దోచుకుంటారు. ఇంకా కొందరు కొంచెం ముందడుగేసి పని వేళల్లో కూడా పని చెడగొట్టే వీరిపనికిమాలిన ప్రబోధాలతో విలువైన జాతి సంపద కు గండి కొడుతున్నారు. పైగా వీరి దోపిడీకి ఎటువంటి పన్నులు ఉండవు. చిన్న చిన్న గుడిసెల్లో, రోడ్ పక్క గుడారాలతో ప్రారంభం అయ్యే వీరి ప్రస్థానం పెద్ద బంగాళాల్లో, ఖరీదైన కార్లలో, విమానాల్లో తుల తూగుతుంటుంది. పైగా వీరు విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టి ప్రజల్లో సంకుచిత భావనలు నాటుతారు.మత గ్రంథాల్లో ఉన్న అజ్ఞాన అంధకారం చాలదన్నట్టు కొత్త కొత్త భాష్యాలతో,సరికొత్త పూజా ప్రార్ధనలు, నూతన దుస్సంప్రదాయాలకు, విష బీజాలను ప్రజల మనసుల్లో చేరవేస్తారు. పైగా తమ మత గ్రంధాల్లోనే సమస్త విజ్ఞానం ఉందని అజ్జ్ఞానపు వాదనలతో బ్రైన్ వాష్లు చేస్తారు, ప్రార్దనలు,యాగాలు, రకరకాల వికారపు విన్యాసాలు, భయానక భీభత్స ప్రసంగాలు, ఆశ్రమాల పేరుతో భూకబ్జాలు, చిన్న పిల్లల, సాయం కోరి వచ్చిన ఆడవాళ్ళ పై ఆఘాయిత్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే వీరి దుర్మార్గాలకి అoతులేదు. కొ(చె)త్త వైద్య ప్రక్రియలు కనిపెట్టి, అన్నీ రోగాలని ప్రార్ధనలతో నయం చేస్తామని ప్రగల్బాలు పలికే మత బోధకులు ఈ కరోనా పై నోరు మెదపరు. కొన్ని రోజుల కిందటి చైనా క్రైస్తవుల్ని హింసిస్తుంది కాబట్టి అక్కడ కరోనా విజృభించింది అన్న మత ప్రబోధకుడు సెయింట్ పీటర్స్ చర్చ్ నెలవైన ఇటలి లో ఎందుకు విజృబిస్తుందో సమాధానం చెప్పరు. బాలాజీ దయ వల్లే భారత్ లో కరోన లేదు అని అన్న ఒక పూజారి కరోనా ప్రభావంతో సదరు గుడినే ఎందుకు మూసేశారో చెప్పరు. అన్నీ శాస్త్ర సాంకేతిక విశేషాలు తమ మత గ్రంథాల్లో డప్పు కొట్టుకేనే వాళ్ళు ఈ కరోనా కి మందు కనిపెట్టి, నోబెల్ ప్రైజ్ ని వాళ్ళ దేవుడికి అంకితం చెయ్యొచ్చు కదా. కరోనా తగ్గడానికి కొత్త యోగాసనం కనిపెట్టి వాళ్ళ దేవుడి పేరుతో పేటెంట్ తీసుకోవచ్చు కదా ఇవేమీ చేయలేరు. సామూహిక ప్రార్ధనలు, హిస్టీరియా ఏడుపులు, పొర్లు దండాలు, తెల్లవారు జాము మైకు గోలలు, ఇవేమీ వైరస్ ల నుండి కాపాడలేవు. దేవుడి పేరుతో చేసే రికార్డింగ్ డాన్స్లు, పబ్లిక్ న్యూసెన్స్లు,పెద్ద స్పీకర్లు పెట్టి మరి ఏడ్చే ఏడుపులు ఇదే కదా వీరు చేసే దైవ కార్యాలు. ఈ పిచ్చి ఇంకా విస్తృతమైన తమ దేవుడే నిజమైన దేవుడని మత మార్పిడులు, మారని వారి పై దాడులు, ఇది ఇంకా ముదిరి తీవ్రవాదం. ఈ తీవ్రవాదం వల్ల మానవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు తెలియనివి కాదు. ఇదే ప్రస్తుత అభివృద్ది తీవ్ర ఆటంకం. నాస్తికులు అత్యధికంగా ఉన్న దేశాలైన నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మనవాభివృద్ది, సంతోషకర దేశాల సూచికలో ముందున్నాయి. దాదాపు అందరూ ఆస్తికులుగా దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా మరియు ఆఫ్రికా దేశాలు ఎందుకు వెనుకబడ్డాయి. పైగా క్రైమ్ రేట్ నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చాలా తక్కువగా ఉంది. దీన్ని బట్టి మతానికి నైతికతకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. మతం మనకు ఎలాంటి నైతికత నేర్పుతుంది అనే విషయం పై రిచర్డ్ డాకిన్స్ అనే రచయిత గాడ్ డేల్యూజన్ అనే పుస్తకంలో చక్కగా వివరించారు.* *ఇప్పటికైనా ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టి మీ యొక్క విలువైన సమయాన్ని, డబ్బుని విద్య మరియు వైద్యం లో ఖర్చుపెట్టండి లేదా మదపు చేయండి . ప్రభుత్వాలు కూడా సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెట్టకుండా విద్యా, వైద్యానికీ సరైన కేటాయింపులు చేయాలి. మతం పేరుతో తిరిగే సోమరిపోతుల ఆదాయాన్ని టాక్స్ పరిధిలోకి తీసుకురావాలి. కాలు కడపకుండా ప్రజల దక్షిణల,దశమ భాగాల, కానుకలతో జల్సా చేసే వాళ్ళను ప్రజలు గుర్తించాలి, వారికి శ్రమ విలువ తెలియచేయాలి. ప్రజల హేతువాదం, తర్కం తో కూడిన ఆలోచనలు, ప్రశ్నిoచే స్వభావాన్ని కలిగినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అప్పటి వరకు ఈ సోమరిపోతులు సామాన్యుల అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని వీరిపై స్వారీ చేస్తూనే ఉంటారు .*
ప్రొ;; మాజీ MLC కె నాగేశ్వర్ … ఎనాలసిస్