ఒబామాను కలిసిన మన రైతు మోడీ పరువు తీసేశాడు
Dec 04, 2018
ఆరుగాలం కష్టపడి.. ఎండనకా.. వాననకా.. తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో ఆ రైతు వినూత్న నిరసన తెలిపాడు. అయితే, ఆ నిరసన ఏకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఉందని అంటున్నారు.
ఈ ఆవేదనలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవాక్కయ్యే రీతిలో ఉందంటున్నారు. రైతు పంటకు పెట్టుబడి కన్నా 50 శాతం లాభం వచ్చేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. కనీసం పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
మహారాష్ట్రకు చెందిన రైతు నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లిగడ్డను పండిస్తే మార్కెట్లో దానిని రూ.1,064కు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో చెమ్మగిల్లిన కండ్లతో ఆ రైతు వచ్చిన సొమ్మును ఇంటికి తీసుకుపోవడానికి ఇష్టపడక ఆ డబ్బును ప్రధానమంత్రి మోడీకి పంపాడు.
No comments:
Post a Comment